NTV Telugu Site icon

NIRF: మరోసారి అగ్రగామిగా మద్రాస్ ఐఐటీ.. హైదరాబాద్ ఐఐటీ స్థానం ఎంతంటే?

Iit Hyderabad

Iit Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. 9వ ఎడిషన్ కింద ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024 సంవత్సరానికి సంబంధించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌ను విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్‌సైట్ nirfindia.orgలో తనిఖీ చేయవచ్చు. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐటీ మద్రాసు టాపర్‌గా నిలిచింది. ఈ ఏడాది 10,000 దరఖాస్తులు వచ్చాయి.

READ MORE: Telusu Kada: సిద్ధూ కోసం థమన్.. రచ్చ లేపుడే

హైదరాబాద్ ఐఐటీ స్థానం?
కాగా.. ఈ జాబితాలో ఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్12 వ ర్యాంక్ సాధించింది. టాప్ 10లో స్థానం సాధించలేకపోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 25 వ ర్యాంక్ వచ్చింది. నీట్ వరంగల్ 53 వ ర్యాంక్, ఉస్మానియ యూనివర్సిటీ 70 వ ర్యాంక్ లో ఉన్నాయి.

READ MORE:Nagarjuna: మ మ మాస్.. గెట్ రెడీ బాయ్స్

ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఐఐటీ మద్రాస్‌ వరుసగా 9వ సారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానానికి చేరుకుంది. నిట్ వరంగల్ కు 21వ స్థానం వరించింది. మెడికల్ కాలేజీల్లో ఉస్మానియ మెడికల్ కాలేజ్ 48 వ ర్యాంక్ సాధించింది. రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్లో ఐఐటీ హైదరాబాద్ 15 వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 28 వ స్థానాల్లో నిలిచాయి.

READ MORE:Viral Video: విమానాశ్రయంలోని రన్‌వేపైనే పాము-ముంగిసల యుద్ధం..వీడియో వైరల్

విశ్వవిద్యాలయాల పరంగా…టాప్ 10లో నిలిచినవి..
1.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
2. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
3. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
4. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
5. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
6.యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ
7. అమృత్ విశ్వ విద్యాపీఠ్, కోయంబత్తూరు
8. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్
9.జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా
10. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్

READ MORE:CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్

ఉన్నత విద్యాసంస్థల్లో..
1.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
5.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
7. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
9. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
10. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ

READ MORE: CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్

కళాశాలల విభాగంలో…
1.హిందూ కాలేజ్, ఢిల్లీ
2.మిరాండా హౌస్, ఢిల్లీ
3.సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
4.రామ్ కృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్, కోల్‌కతా
5.ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కాలేజ్, ఢిల్లీ
6.సెయింట్ జేవియర్స్ కాలేజ్,
కోల్‌కతా .PSGR కృష్ణమ్మాళ్ మహిళా కళాశాల, కోయంబత్తూర్
8. లయోలా కాలేజ్, చెన్నై
9. కిరోరి మాల్ కాలేజ్, ఢిల్లీ
10. లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ

READ MORE:Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఇంజినీరింగ్‌ విభాగంలో….
ర్యాంక్ 1: IIT-మద్రాస్, తమిళనాడు
ర్యాంక్ 2: IIT ఢిల్లీ, ఢిల్లీ
ర్యాంక్ 3: IIT-బాంబే, మహారాష్ట్ర
ర్యాంక్ 4: IIT-కాన్పూర్, ఉత్తరప్రదేశ్
ర్యాంక్ 5: IIT-ఖరగ్‌పూర్, పశ్చిమ బెంగాల్
ర్యాంక్ 6 IIT రూర్కీ, ఉత్తరాఖండ్
ర్యాంక్ 7 : IIT-గువాహటి, అస్సాం
ర్యాంక్ 8: IIT-హైదరాబాద్, తెలంగాణ
ర్యాంక్ 9: N. I.T తిరుచిరాపల్లి, తమిళనాడు
ర్యాంక్ 10: IIT-బనారస్, యూపీ

Show comments