Telusu Kada: సిద్ధూ కోసం థమన్.. రచ్చ లేపుడే
- స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా 'తెలుసు కదా'
- రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో
- సిద్దూ జొన్నలగడ్డ రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను షూట్
- 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్
- ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను షూట్ చేయడం మొదలు పెట్టారు. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కెకె లిరిక్స్ రాశారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ హ్యుజ్ సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ పాటకు సిద్ శ్రీరామ్ తన గాత్రం అందించనున్నారు.
Also Read: Nagarjuna: మ మ మాస్.. గెట్ రెడీ బాయ్స్
Also Read
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
- Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్ లో అనేక సీన్స్ తో పాటు పాట షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. మామూలుగానే స్టైలిష్ గా ఉండే సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో తన పాత్ర కోసం మరింతగా స్టైలిష్ మేకోవర్ అయ్యారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరోపక్క ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్ కాగా బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!