NTV Telugu Site icon

TS EDCET Counselling 2023 : ప్రారంభమైన తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. 30 వ తేదీ వరకే ..

Untitled 14

Untitled 14

బీఈడీ చెయ్యాలనుకునే వాళ్లకి ఎడ్‌సెట్ అనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) మే 18వ తేదీన 49 పరీక్ష కేంద్రాల్లో ఈ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు 27,495 మంది హాజరైయ్యారు. కాగా జూన్ 12న ఫలితాలు విడుదల చెయ్యగా.. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో నిన్నటి నుండి బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 20వ తేది నుంచి 30వ తేది లోపు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Read also:Salaar: ‘సలార్‌’ వల్ల కొత్త తలనొప్పి… ఆ సినిమాలన్నీ వెనక్కేనా?

కాగా ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ సెప్టెంబరు 25వ తేది నుంచి 29వ తేది వరకు నిర్వహించబడుతుంది. వెబ్ ఆప్షన్లు నమోదు అక్టోబ‌ర్ 3వ తేది నుంచి ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అక్టోబ‌ర్ 3వ తేది నుండి అక్టోబర్ 5వ తేది వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబ‌ర్ 6వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు మొదటి విడత సీట్లను అక్టోబ‌ర్ 9వ తేదీన కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 10వ తేది నుంచి 13వ తేది మ‌ధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా తరగతులు అక్టోబర్ 30 నుండి ప్రారంభమవుతాయి. మరింత సమాచారం కోసం అభర్ధులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ను సంప్రదించగలరు.

Show comments