నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి ఇది శుభవార్తే.. ఈస్ట్ రైల్వేస్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1832 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
దానాపూర్ డివిజన్, ధన్‌బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్‌పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్(హర్నౌట్), మెకానికల్ వర్క్‌షాప్(సమస్తిపూర్..
పోస్టులు వివరాలు..
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్..
అర్హతలు..
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
01.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.. 09.12.2023..
వెబ్‌సైట్: https://www.rrcecr.gov.in/.. ఈ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..