Global Telugu Teacher: ప్రపంచ స్థాయికి ఎదిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. 130 దేశాల్లో 35 వేల మంది స్టూడెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్‌మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గల తెలుగు పాఠ్యాంశాలను తనదైన శైలిలో వీడియో లెసన్స్‌గా మార్చారు. భవిష్యత్తులో 10వ తరగతి వరకు ఉన్న పాఠాలను కూడా ఇలా దృశ్య మాధ్యమంలోకి మార్చనున్నారు.
వర్ణమాల, వ్యాకరణం సహా మన భాషలోని అనేక అంశాల్ని ఉదాహరణలతో వివరించటం ఈ వీడియోల ప్రత్యేకత. ఈ ప్రజెంటేషన్లను జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్స్‌కి పంపిణీ చేస్తూ ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరూ ఈ లెసన్స్ నేర్చుకునేలా ఇంటర్నెట్(ఆన్‌లైన్)లో అందుబాటులోకి తెచ్చారు. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన వందలాది ప్రోగ్రామ్‌ల వీడియోలను యూట్యూబ్(https://www.youtube.com/c/KrishnaPrasadlessons/videos)లో అప్‌లోడ్ చేశారు. దీంతో వివిధ దేశాల్లోని తెలుగువారు ఆయనకు నిత్య విద్యార్థులుగా మారారు. కృష్ణప్రసాద్ క్లాస్‌లను క్రమంతప్పకుండా వింటున్నారు. తద్వారా ఆయనకు 130 దేశాల్లో 35 వేల మంది స్టూడెంట్స్ అయ్యారు. ఇది ఎనిమిదేళ్ల కిందటి వార్త. ఈ మధ్య కాలంలో కృష్ణప్రసాద్ మరెన్ని అప్‌డేట్స్ తీసుకొచ్చారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Also Read
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..