ఆర్టీసీలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 309 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి… ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హులైన అభ్యర్థులకు కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం సెలెక్ట్ చెయ్యనున్నారు..
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు : 309
కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్..
అర్హతలు..
ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15లోగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు..
ఈ నోటిఫికేషన్‌తోపాటు ఇచ్చిన రెజ్యూమ్ ఫార్మాట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నింపి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీలను జతచేసి నిర్ణీత తేదీ రోజు ధ్రువపత్రాల పరిశీలను హాజరుకావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఆధార్ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే, ఐటీఐ కళాశాలలో సంప్రదించవచ్చు.. అప్లికేషన్ ఫీజు 110 రూపాయలు..
ఎంపిక విధానం..
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ
15-11-2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ
16-11-2023
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
ప్రిన్సిపల్, ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్లు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..