ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
పోస్టులు వివరాలు..
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ సివిల్): 90
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్): 106
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13..
అర్హతలు..
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే, వారు ఆ సబ్జెక్ట్ లో గేట్-2024కు హాజరై, ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది..
అప్లికేషన్ ఫీజు..
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఏఏఏలో సంవత్సరం అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకున్నవారికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది..
ఈ పోస్టుల పై అర్హత ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక వెబ్ సైట్ www.aai.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు..