AAI Jobs 2023: గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 900 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు.. 906
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
AAICLAS ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేస్తుంది..
వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థుల వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయోపరిమితి విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఐదేళ్ల సండలింపు ఉంటుంది..
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 పేమెంట్ చేయాలి..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో పర్సనల్ ఇంటరాక్షన్, రెండో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడో దశలో రాత పరీక్ష, నాలుగో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది..
జీతం..
అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30వేలు జీతం లభిస్తుంది. ఆ తరువాత రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.32వేలు, మూడో సంవత్సరం నెలకు రూ.34వేల జీతం లభిస్తుంది.. సెలెక్ట్ అయిన వారు దేశ వ్యాప్తంగా జాబ్ చేయాల్సి ఉంటుంది..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా AAICLAS అధికారిక పోర్టల్ aaiclas.aero ఓపెన్ చేయాలి.
హోంమ్పేజీలోకి వెళ్లి, ‘కెరీర్స్’ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ ‘AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్మెంట్-2023’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. ఫారమ్ నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!