Education: బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అనుకునేవాళ్లు ఎందరో ఉన్నారు మనలో. కానీ కొందరు మాత్రం ఆర్మీలో ఉద్యోగం సాధించాలని.. దేశ సేవలో జీవితాన్ని సాగించాలని ఆరాట పడుతుంటారు. దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తుంటారు. అలా ఆర్మీలో ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ శుభ వార్త చెప్పింది. వివారాలలోకి వెళ్తే.. అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరం అగ్నివీరుల నియామకాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఈ పరీక్షకి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాత పరీక్షలో ఉతీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిసికల్ టెస్ట్ మరియు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
Read also:Jowar Laddu : ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం.. జొన్నలడ్డు తయారీ విధానం..
ఈ తరుణంలో ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు చెప్తూ ఫైనల్ మెరిట్ జాబితాను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. అభ్యర్థులకు ఎన్నో పరీక్షలు పెట్టి మట్టిలో మాణిక్యాలు వెతికినట్టు అభ్యర్థులను వడపోసిన అనంతరం తాజగా ఈ మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏఆర్‌వో చెన్నై, అంబాల, పుణె, జలంధర్,విశాఖపట్నం, గుంటూరు, భోపాల్, కోల్‌కతా, డిల్లీ, రాంచీ తదితర జోన్లకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఏఆర్‌వో సికింద్రాబాద్ జోన్ ఫలితాలు విడుదల కాలేదు. ఏఆర్‌వో సికింద్రాబాద్ జోన్ ఫలితాలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాసం ఉంది. అభ్యర్థులు ఫలితాల కోసం https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ను సందర్శించగలరు. ఈ నేపథ్యంలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.