Jubair : విదేశాల్లో ఉంటారు.. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళని మోసం చేస్తారు.. లేని ఒక దానిని పేరు చెప్పి డిజిటల్ అరెస్ట్ అని భయపడతారు.. అంతేకాదు 24 గంటల పాటు మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని చెప్పి భయభ్రాంతులకు చేస్తారు.. ఇంటి నుంచి బయటికి రాకుండా చేస్తారు.. దానికి తోడు మీరు ఎవరికైనా సమాచారం ఇస్తే మిమ్మల్ని శాశ్వతంగా లోపల వేస్తామని బెదిరిస్తారు.. మీ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటిని మా చేతిలోకి తీసుకున్నామని భయపెట్టిస్తారు. మేము చెప్పినట్లు చేయకపోతే మీరు శాశ్వతంగా జైలుకు వెళతారని భయపడతారు.. డిజిటల్ అరెస్టు ఏమీ లేదు అంతా ఒట్టిదే అని చెప్పి ఏకంగా ప్రధానమంత్రి స్పందించవలసిన పరిస్థితి ఏర్పడింది.. అయినప్పుడు కూడా డిజిటల్ అరెస్టు పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు అమాయకుల్ని మోసం చేసి కోట్ల రూపాయలను కొట్టివేస్తున్నారు.. ఇదే తరహాలో హైదరాబాద్ కు చెందిన యువకుడు ముంబైలో మకాం వేసి ఏకంగా కోట్ల రూపాయలను కొట్టేసి తిరిగి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి లోపల వేశారు..
Read Also : Off The Record: కేటీఆర్ ఇప్పుడెందుకు స్టేట్ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు..? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి..?
దుబాయ్ కేంద్రంగా డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను దోచుకుంటున్న ప్రధాన సూత్రధారిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న వెంటనే జుబేర్ ను అరెస్టు చేసి రిమాండ్ పంపారు.. గత ఆరు సంవత్సరాల నుంచి జుబేర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.. చివరికి దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ కి జుబేర్ వస్తున్నాడని తెలిసి పోలీసులు అప్రమత్తమై అరెస్టు చేశారు. ఇతను దుబాయ్ లో మకాం వేసి తన అనుచరులతో బ్యాంక్ ఖాతాలను తెరిపించి వాటి ద్వారా దేశవ్యాప్తంగా 124 కేసులలో బాధితులను నిండా ముంచాడు.. డిజిటల్ అరెస్టు పేరు చెప్పి వీళ్లందరి దగ్గర నుంచి దండిగా వసూలు చేశాడు. అందులో తెలంగాణకు చెందిన 23 మంది బాధితులు ఉన్నారు.. ప్రముఖుల కేసులకు సంబంధించి మీ బ్యాంకు ఖాతా వివరాలు వెలుగులోకి వచ్చాయని, ఈడీ సిబిఐ మీకోసం వెతుకుతుందని విజిలెన్స్ అధికారులు త్వరలో వచ్చే మిమల్ని అరెస్టు చేస్తారని, తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని లేదా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరిస్తారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి గతేడాది జూలైలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.
మీ ఆధార్ కార్డు ఐడితో ముంబయి నుంచి ఇరాన్ కు 130 ఎల్ఎస్ డి షీట్స్, 2 లాప్ టాప్ లు, 6 కేజీల బట్టలు, 2 లాప్ టాప్ లు, 7 పాసుపోర్టులు, 4 క్రెడిట్ కార్డులు వెళ్తున్నాయని పోలీసులు, కస్టమ్స్ అధికారులు గుర్తించారని చెప్పాడు.. స్కైప్ వీడియో కాల్ ద్వారా ముంబయి పోలీసులు మాట్లాడుతున్నారని భయపెట్టించారు.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తామని కలవరానికి గురి చేశారు. ఈ కేసును నుంచి క్లీన్ గా బయటపడాలంటే మీరు మీ ఖాతాల్లో ఉన్న డబ్బులతో పాటు ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వాలని భయపెట్టారు. దీంతో బాధితుడు మొత్తం వారు చెప్పినట్లు రూ.55 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత మోసపోయానని భావించి సీసీఎస్ సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి డబ్బు నుంచి బదిలీ అయిన ఖాతాదారులు మీర్ రజాక్ అలీ, మహ్మాద్ సయ్యిద్, జుబేర్, దస్తగిరి షాలకు వెళ్లాయని పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. విచారణలో వీరంతా కమీషన్ ల మీద ఖాతాలను దుబాయ్ లో ఉన్న మహ్మద్ జుబేర్ కు అందించామని చెప్పారు. దీంతో పోలీసులు మహ్మద్ జుబేర్ మీద లుక్ ఔట్ నోటీసు లు జారీ చేశారు.
జుబేర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడంతో అతన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విచారణలో జుబేర్ డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను టార్గెట్ చేసి వారి నుంచి కొట్టేసిన డబ్బులను తన అనుచరులు ఇచ్చిన ఖాతాల్లోకి మళ్ళించి వాటిని దుబాయ్ లో విత్ డ్రా చేసుకుంటున్నట్లు తెలిపాడు. జుబేర్ కు సాదిక్ సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సాదిక్ దుబాయ్ లో ఉన్నాడని విచారణలో బయటపడింది. డిజిటల్ అరెస్టు అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే అది సైబర్ మోసమని గుర్తించాలని కోరుతున్నారు.