Youtuber Deena: గేమ్ చేంజర్.. చివరికి ఆ గేమ్‌కి బలయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber Deena Ends His Life For Not Getting In Youtube: ఆ యువకుడి పేరు డీనా.. ఐఐటి గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ డీలర్ చదువుకుంటున్నాడు. మానసిక ఒత్తిడితో పాటు యూట్యూబ్‌లో తాను పెట్టిన గేమింగ్ చానెల్‌కి వ్యూస్ రావడం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో ప్రత్యేకంగా గేమ్స్ కోసం చానల్ నిర్వహిస్తున్న డీనా.. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకంటే కొన్ని గంటల ముందే తన యూట్యూబ్‌లో డీనా తాను చనిపోతున్నట్లు ఒక ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ కూడా పెట్టాడు. మరోవైపు చివరిగా ఐదు నిమిషాల పాటు లైవ్లో గేమ్ ఆడాడు. ఆ గేమ్ మొత్తంలో కూడా తన బాధను డీనా వర్ణించుకున్నాడు.
తాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పడుతున్న బాధల్ని తన యూట్యూబ్ ఛానల్‌లో సవివరంగా చెప్పాడు. అలాగే చాలామందికి తాను చనిపోతున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టాడు. కానీ ఎవరు కూడా యూట్యూబర్ చెప్పిన మాటలను నమ్మలేదు. గత రెండు రోజుల నుంచి చాలామందికి యూట్యూబర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సమాచారం ఇచ్చాడు. అయినా ఎవరు స్పందించలేదు. దీంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురైన యూట్యూబర్ డీనా.. ఇవాళ ఉదయం 12 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనంపైకి ఎక్కి కిందకి దూకాడు. అనుమానాస్పద కేసుగా సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
చదువులో మంచి చురుకుదనం ఉన్న డీనా.. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. గేమ్ ఛేంజర్ పేరుతో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్, దాదాపుగా రెండు లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యేకంగా గేమ్స్ వస్తున్న సమయంలో బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ ఆడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు. దీంతో పాటు సొంతంగా గ్రాఫిక్స్, తర్వాత కొంతమంది పిల్లలు చేత యుద్ధాలు లాంటివి చేయించి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయించుకున్నాడు. ఇలా ప్రతిదాన్ని వెనకాల గేమ్ చేంజర్ తన స్టైల్ లో ముందుకు దూసుకుని వెళ్తున్నాడు.
తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న డీనా.. చాలా కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. తన మాటలు, చేష్టలతో ఇవి కనపడుతున్నాయి. అయితే తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. తల్లి రక్షణ రంగంలో చీఫ్ సైంటిస్ట్‌గా కొనసాగుతుండగా.. తండ్రి దక్షిణ మధ్య రైల్వేలో కీలక స్థానంలో ఉన్నాడు. ఐ పాడ్‌తో గేమ్స్ తయారు చేసి, వాటిని అప్లోడ్ చేస్తుంటాడు. మరోవైపు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ని సంపాదించాడు. చాలామంది ప్రముఖులతో కూడా డీనాకు పరిచయం ఉంది. తీవ్రమైన మానసిక క్షోభతో కొట్టుమిట్టాడుతున్న డీనా.. ఇటీవల కాలంలో తన మిత్రులందరికీ ఒక సమాచారం ఇచ్చాడు.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి 8 గంటల ముందు ఒక సూసైడ్ లెటర్‌ని కూడా అప్లోడ్ చేశాడు. దాంట్లో తాను ఎందుకు చనిపోతున్నానో కారణాల్ని, చిన్నప్పటినుంచి తాను పడ్డ బాధలు, అనుభవించిన కష్టాలన్నీ వర్ణించాడు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి తన తాను శారీరిక గా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి అయ్యానని, అత్యాచారానికి గురై అయ్యానని కూడా పేర్కొన్నాడు. అలాగే తనను కొంతమంది మోసం చేసినట్లు అందులో తెలిపాడు. తనకు గుడ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని పేర్కొంటూ, తన చావుకు కారణమైన మొత్తం 8 పేజీల సూసైడ్ లెటర్ ని తన యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకున్నాడు.
చాలామంది ప్రముఖులకు కూడా సోషల్ మీడియా ద్వారా తన లెటర్‌ని, తర్వాత తాను చనిపోతున్నట్లు విషయాన్ని కూడా చెప్పాడు. రెండు రోజులపాటు తన మెసేజ్‌కి ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఎవరు కూడా తనను పట్టించుకోలేదన్న భాదతో, ఇవాళ ఉదయం చివరిగా ఒక గేమ్ ఆడాడు. తాను ఉంటున్న భవనం పైకి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. గేమ్ చేంజర్‌గా యూట్యూబ్‌లోకి వచ్చిన డీనా.. అదే గేమ్‌కు బలయ్యాడు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!