Site icon NTV Telugu

illicit Affair: భార్యతో యువకుడి అక్రమ సంబంధం.. షూ లేసుతో హత్య చేసిన భర్త!

Madanapalli

Madanapalli

illicit Affair: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణ హత్య సంచలనం రేపుతుంది. మదనపల్లికి చెందిన ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక, మదనపల్లి మండలంలోని మాలెపాడు గ్రామం, ఆవులపల్లెకు చెందిన ఆవుల నరసింహులు ఇటీవల కనిపించకుండా పోయాడు. అయితే, సీటీఎం గ్రామం, దిన్నెమీదగ్రామం ప్రాంతానికి చెందిన నాగరాజు భార్య గంగాదేవితో నరసింహులుకు అక్రమ సంబంధం ఉంది.

Read Also: CM Revanth Reddy: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్.. సీఎంగా రెండోసారి..

అయితే, ఈ అక్రమ సంబంధంపై గురైన భర్త నాగరాజు నరసింహులుపై కక్ష పెంచుకున్నాడు. దీంతో 20వ తేదీన మంత్రాలు చేయాలని నమ్మబలికి శ్రీనివాసమంగాపురానికి తీసుకెళ్లిన నాగరాజు, తన స్నేహితుడు ముదిరాజుతో కలిసి ప్లాన్ ప్రకారంగా నరసింహులును ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. షూ లేసుతో గొంతు బిగించి హత్య చేశారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే నాగరాజు, ముదిరాజు సాయంతో నరసింహులును అతి క్రూరంగా చంపేశాడు. హత్య చేసిన తర్వాత పాతిపెట్టినట్లు తెలుస్తుంది.

Read Also: Samsung Galaxy Z TriFold: సామ్ సంగ్ మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం..

ఇక, నర్సింహులు కనిపించకపోవడంతో 20వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు అయింది. విచారణలో భాగంగా నాగరాజుపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్య చేసినట్లు నాగరాజు ఒప్పుకున్నాడు.. ఈ హత్యకు సహకరించిన ముదిరాజు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. అలాగే, నాగరాజు సూచించిన ప్రాంతంలో పోలీసులు నేడు నరసింహులు మృతదేహాన్ని వెలికితీసే అవకాశం ఉంది.

Exit mobile version