హర్యానాలో దారుణం చోటుచేసుకుంది . స్నేహితుడే కదా అని నమ్మి వెళితే నట్టేటా ముంచాడు. టీ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను స్నేహితులకు అప్పగించి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముగ్గురు యువకులు, యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే ఫతేబాద్‌కు చెందిన ఒక యువతి కొన్ని రోజులుగా సంజయ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇక ఈ గత నెల 20 న సంజయ్, యువతిని తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు. ప్రియుడే కదా అని నమ్మి వెళ్లిన యువతికి అక్కడ మరో ముగ్గురు యువకులు కనిపించారు. సంజయ్ ఆ యువకులను తన స్నేహితులుగా పరిచయం చేసి అందరికి టీ ఇచ్చాడు. టీ తాగిన యువతి కొద్దిసేపటికి స్పృహ కోల్పోయింది. తరువాత ప్రియురాలిని ముగ్గురు స్నేహితులకు అప్పగించి సంజయ్ పరారయ్యాడు. ఆ ముగ్గురు.. ఆమెను సాముహిక అత్యాచారం చేసి వీడియోలు తీశారు. యువతి స్పృహలోకి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో తమ దగ్గర వీడియోలు ఉన్నాయని, బయట ఎవరికైనా చెప్తే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న యువతి ఇటీవల ఆ వీడియోలను చూపించి ఎక్కడికి పడితే అక్కడకు రమ్మంటున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు
