Site icon NTV Telugu

కాబోయే భర్తే కదా అనుకోని ఆ పనికి ఒప్పుకున్న యువతి.. కానీ, చివరికి ఇలా

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన జుట్టు రామ్‌ కార్తీక్‌ అలియాస్‌ రమేశ్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ కూడా త్వరలో ఉండడంతో కార్తీక్, ప్రగతి ఫోన్లో మాట్లాడుకొనేవారు. కార్తీక్ ఆమెను ఎప్పుడు నగ్న వీడియోలు చేయమని బలవంతపెట్టేవాడు. కాబోయే భర్తే కదా అని ఆమె కూడా నో చెప్పకుండా న్యూడ్ కాల్స్ చేసింది. ఈ కాల్స్ ని ఆమెకు తెలియకుండా కార్తీక్ రికార్డు చేశాడు. ఇక ఇటీవల ఇండియా వచ్చిన కార్తీక్, ప్రగతితో చనువుగా మాట్లాడుతూ, ఫోటోలు తీసుకున్నాడు.

ఇక ఈ నేపథ్యంలోనే కట్న కానుకల విషయంలో ఇరు కుటుంబ సభ్యులకు బేధాభిప్రాయాలు రావడంతో అమ్మాయి తరుపువారు సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.దీంతో కార్తీక్ రెచ్చిపోయాడు.. తాము అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేయకపోతే ప్రగతి నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ ఫోటోలు బయటపడితే పరువు పోతుందని భయపడిన ప్రగతి అక్టోబర్‌ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ ని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కి తరలించారు.

Exit mobile version