Vijayawada Drugs Case: విజయవాడలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.. ఈ కేసులో ఏ5గా కొండారెడ్డి పేరును చేర్చారు మాచవరం పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ఏ6 మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా కొండారెడ్డి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది. కొండారెడ్డికి డ్రగ్స్ కొనుగోలులో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు.. కొండారెడ్డికి ఏ4 నిందితుడు లోహిత్ యాదవ్, అలాగే ఏ6 మధుసూదన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.. లోహిత్ యాదవ్ ద్వారా మధుసూదన్ రెడ్డి నుంచి MDMA డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు. నిందితుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా రికార్డులు తదితర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Also: US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం