Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్‌వాడ్‌లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్‌లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్‌ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
వందనా ద్వివేది అనే మహిళా ఐటీ ప్రొఫెషనల్ హింజవాడిలోని ప్రముక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన రిషబ్ నిగమ్‌తో ప్రేమలో ఉంది. గత పదేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వందనను కలిసేందుకు రిషబ్ పూణేకు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జనవరి 25 నుంచి హింజవాడిలోని హోటల్ బుక్ చేసుకున్నారు.
అయితే, గత కొన్ని రోజులుగా వందన క్యారెక్టర్‌పై రిషబ్ అనుమానంతో ఉన్నాడు. దీంతోనే ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వందనపై కాల్పులు జరిపిన తర్వాత రిషబ్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో హోటల్ గది నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. పూణే నుంచి ముంబైకి పారిపోయిన రిషబ్‌ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.