Site icon NTV Telugu

Uttar Pradesh: గన్ తో బెదిరించి మహిళా సిబ్బందిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం..

Rape

Rape

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు బలవంతం చేస్తుంటే సూపర్ వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తి నేరానికి సహకరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు

పోలీస్ అధికారి హేమ్ రాజ్ మీనా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న మాల్ లో దుస్తులు మార్చుకునే గదిలో డ్రెస్ మార్చుకుంటుండగా, సెక్యూరిటీ గార్డు గదిలోకి బలవంతంగా ప్రవేశించి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో మాల్ సూపర్ వైజర్, హౌజ్ కీపర్ నిందితుడికి మద్దతుగా బయట గది తలుపు వెలపల నిలబడి ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని మహిళ పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు బాధిత మహిళ మాల్ లో ఉద్యోగం మానేసింది. అయితే ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు. అత్యాచార బాధితులరాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ఘటన ఇలా ఉంటే.. కొన్ని రోజలు క్రితం బెంగళూర్ లో ఓ మహిళ పార్కులో ఉండగా, నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వేగం వెళ్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ రోజే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు హెచ్చరించడంతో కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

Exit mobile version