Nandigama Crime: సంక్రాంతి పండుగ రోజుల్లో నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నాగేంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15న నాగేంద్రమ్మ ఇంట్లో హత్య జరిగింది.. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగేంద్రమ్మకు గతంలో వివాహం జరగగా.. భర్తతో విడిపోయింది. ఏడాదిన్నర నుంచి లారీ డ్రైవర్ హనుమంత రావుతో సహజీవనం సాగిస్తోంది. హనుమంత రావుకు గతంలో రెండు వివాహాలు అయ్యాయి. వారిద్దరితో విడిపోయి తాజాగా నాగేంద్రమ్మతో కలిసి హనుమంతరావు ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాదానికి కారణాలను పోలీసులు మరొకరితో నాగేంద్రమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవలు అవుతున్నట్టు గుర్తించారు.
Read Also: Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్.. కేపీసీసీ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ!
నాగేంద్రమ్మ కు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు.. నాగేంద్రమ్మను మాయమాటలు చెప్పి హనుమంతరావు సహ జీవనం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున తమతోనే ఉందని రాత్రి పూట ఏం జరిగిందో తెలియదు.. కనుమ పండుగ రోజున మధ్యాహ్నం ఇంట్లో శవమై కనిపించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్రమ్మను హనుమంతరావు తమ్ముడు అశోక్ కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఆశోక్ తో అక్రమం సంబంధం ఉందనే అనుమానంతో హనుమంతరావు హత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపిస్తున్నారు. హనుమంతరావు సోదరుడు అశోక్ తన తల్లి నాగేంద్రమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె కుమారుడు వారి అమ్మమ్మ బంధువులకు తెలియజేశారని వారు తెలిపారు. నాగేంద్రమ్మ కూడా గత కొంతకాలంగా అశోక్ అనే వ్యక్తి తనను మానసికంగా.. శారీరకంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు వద్దకు నాగేంద్రమ్మ వచ్చి చెప్పినట్టు చెబుతున్నారు.
Read Also: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
నాగేంద్రమ్మకు 14 సంవత్సరాల క్రితమే వివాహమైంది. భర్తతో విభేదించి సొంత ఊరు ఐతవరం వచ్చి నివసిస్తుండగా హనుమంతరావు పరిచయం అయ్యాడని ఆ పరిచయం కాస్త సహజీవనంగా మారింది. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన స్థితిలో నాగేంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించారు. నాగేంద్రమ్మ మెడపై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నాగేంద్రమ్మ హత్య కేసులో ఆమెతో సహజీవనం చేస్తున్న హనుమంతరావుని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. హనుమంతరావుతో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.