Shocking: పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో భర్తలు, కాబోయే భర్తల్ని చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన పెళ్లికి రెండు రోజుల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాబోయే భర్తపై, మహిళ ప్రియుడు, ఇతరులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
ఐటీఐ టీచర్ అయిన గౌరవ్ ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఏప్రిల్ 17న అతడిపై దాడి జరిగింది. సౌరవ్, అతడి స్నేహితుడు సోనూ ఇద్దరు కలిసి నగరంలోని ఆదర్శనగర్‌లో అతడిపై దాడి చేశారు. అయితే, గౌరవ్ కుటుంబం, అతడికి కాబోయే భార్య నేహా కావాలని దాడికి ప్లాన్ చేసిందని ఆరోపించింది. గౌరవ్‌పై కర్రలు, బేస్ బాల్ బ్యాట్‌లతో దాడి చేయడంతో రెండు కాళ్లు, ఒక చేయి, ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..
నిందితుడైన సౌరవ్‌తో నేహాకు సంబంధం ఉందని, గౌరవ్ కోమాలోకి వెళ్లే ముందు తమకు ఫోన్ చేసి తనపై దాడి చేసిన వ్యక్తి గురించి చెప్పారని కుటుంబం చెప్పింది. దాడి చేసిన సౌరవ్, తనకు తన ఫోటో చూపించి, నేహనే దీనిని పంపించిందని, ఆమె చంపమని సూచించిందని చెప్పాడని కుటుంబం పేర్కొంది. గౌరవ్ మామ సునీల్ మాట్లాడుతూ.. గౌరవ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన ప్రియుడిని దాడి చేయాలని చెప్పిందని, ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడని చెప్పారు.
ఏప్రిల్ 15న జరిగిన ఎంగేజ్మెంట్‌లో నేహా కుటుంబం గౌరవ్‌కి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చిందని, దాడి సమయంలో నిందితులు వీటిని తీసుకున్నారని, గౌరవ్‌కి వీటిపై హక్కు లేదని చెప్పారని కుటుంబం ఆరోపించింది. గౌరవ్ తండ్రి గతంలో బెదిరింపులపై సౌరవ్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే, క్షమాపణలు చెప్పడంతో విషయం పరిష్కారమైంది.
