Site icon NTV Telugu

Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్‌‌లో పడేసిన ప్రియుడు

Bhopa

Bhopa

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులు గ్రీటింగ్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా గడిపేరోజు. కానీ ఓ ప్రేమికుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది.

మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన అష్రఫీ అలియాస్ సియా అనే యువతి.. భోపాల్‌కు చెందిన వివాహితుడు సమీర్‌తో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరుతో సమీర్ ముగ్గులోకి దింపాడు. చాటింగ్‌లతో రోజురోజుకు బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రేమతో కళ్లుమూసుకుపోయిన సియా.. సమీర్‌తో జీవించాలని మూడు నెలల క్రితం ఇంటిని వదిలిపెట్టి భోపాల్‌కు వెళ్లింది.

ఇది కూడా చదవండి: MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు

తీరా సమీర్‌ దగ్గరకు వెళ్లాక సియా షాకైంది. సమీర్‌ అప్పటికే వివాహితుడు.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురైంది. సియా కమలా నగర్‌లో ఒక ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల మధ్య గొడవలు జరుగుతుండగా.. ఇంకోవైపు నిత్యం సియా-సమీర్ భార్య మధ్య గొడవులు జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. సమీరే.. సియాను నమ్మించి ద్రోహం చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!

అయితే తనను పెళ్లి చేసుకోవాలని సియా తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించింది. ఒకవేళ చేసుకోకపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరించింది. ఈ గందరగోళం మధ్య సమీర్ భార్య జబల్పూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లిపోయాక సమీర్‌లో ఆగ్రహావేషాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సియా-సమీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న సమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సియా గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇనుప పెట్టిలో పెట్టి మంగళవారం అర్ధరాత్రి నిషాత్‌పురా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. గురువారం దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పచ్చబొట్టు ఆధారంగా 24 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించారు.

ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా.. సహకరించిన తల్లి, సోదరిని అరెస్ట్ చేశారు. సమీర్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఈ హత్య గురించి తెలిసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. సియాకు గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో మూడు సార్లు వివాహం అయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version