NTV Telugu Site icon

Family Dispute: భర్త నాలుకను కొరికేసిన భార్య.. ఆత్మహత్య యత్నం..

Woman Bites Off Husband's Tongue

Woman Bites Off Husband's Tongue

Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.

అసిస్టెంట్ ఎస్ఐ బ్రిజ్ రాజ్ సింగ్ ప్రకారం.. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ సైన్(25)కి సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. అయితే, అప్పటి నుంచి ఈ జంట మధ్య తగదాలు జరుగుతున్నాయి. తరుచుగా వీరిద్దరూ గొడవ పడేవారు. గురువారం రాత్రి కూడా గొడవకు దిగారు. సరదు మహిళ కోపంతో కన్హయ్య లాల్ నాలుకలో కొంత భాగాన్ని కొరికినట్లు పోలీసులు చెప్పారు.

Read Also: Betting Apps: 357 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లను నిలిపివేసిన జీఎస్టీ ఇంటెలిజెన్స్.. 126 కోట్లు ఫ్రీజ్..

కుటుంబీకులు కన్హయ్యని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని ఝలావర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నారు. నాలుకను తిరిగి కట్టవచ్చని వైద్యులు తమకు తెలియజేశారని కుటుంబీకులు చెప్పారు. మణికట్టు కోసుకున్న భార్యని బలవంతంగా గది నుంచి బయటకు తీసుకువచ్చి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై కన్హయ్య సోదరుడు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 115(2) మరియు 118(2) కింద స్వచ్ఛందంగా గాయపరచడం మరియు తీవ్రమైన గాయాలు కలిగించినందుకు రవినా సైన్ (23) పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.