NTV Telugu Site icon

Crime : బావతో కలిసి భర్తను చంపిన భార్య..

Crime

Crime

Crime : ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధం కోసం కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. పడక సుఖం కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త ప్రాణాలు తీసి సంచలనం రేపింది. తన సుఖం కోసం భర్తను ప్లాన్ చేసి మరీ చంపింది. ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి చంపిందని తేల్చారు.

Read Also : Ram Charan: రామ్ చరణ్ కి బాలీవుడ్ పిలుపు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచపేటలో ఉండే నరేశ్, రంజిత దంపతులు. రంజితకు తన బావ అయిన గద్దల సాంబశిరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త నరేశ్ కు తెలియడంతో చాలా గొడవలు అయ్యాయి. భార్యను బుద్ధిగా ఉండాలంటూ హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. తమ సుఖానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో నరేశ్ ను చంపేందుకు రంజిత, సాంబశివరావు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 13న రంజిత మద్యం సీసాలో ఇంజెక్షన్ ద్వారా విషం కలిపి భర్తకు ఇచ్చింది. అది తాగిన నరేశ్ ను పాల్వంచపేట చెరువు వద్దకు రంజిత, సాంబశివరావులు తీసుకెళ్లారు. అక్కడ మరో వ్యక్తితో కలిసి హత్య చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also : Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు