NTV Telugu Site icon

Eluru Tragedy: ఏలూరులో విషాదం.. భర్త, ఇద్దరు కూమారుల మృతి.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య..

Eluru

Eluru

Eluru Tragedy: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. కన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతిచెందడంతో.. రెండు రోజులు తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి.. చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది.. మీరు లేని చోట నేను ఉండలేను అంటూ.. ఎక్కిఎక్కి ఏడ్చిన ఆమె.. చివరకు కన్నుమూసి.. తన భర్త, ఇద్దరు పిల్లల దగ్గరకు వెళ్లిపోవాలనుకుందేమో.. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుఇంది.. ఈ ఘటన ఏలూరులో విషాదంగా మారింది..

Read Also: Mega Hero Movies: అయ్యో రామ.. ఒకరినొకరు టార్గెట్ చేసుకున్న ‘మెగా’ హీరోస్!

అయితే, రెండు రోజుల క్రితం పోలవరం కుడి కాలువలో పడి భర్త శెట్టిపల్లి వెంకటేశ్వరరావు.. ఇద్దరు పిల్లలు మణికంఠ, సాయికుమార్ మృతి చెందారు.. ఊహించని ఈ ఘటన.. ఆ కుటుంబంలోని అందరి ప్రాణాలు తీస్తుందనుకోలేదు.. వేంకటేశ్వర రావు భార్య దేవి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. భర్త , ఇద్దరు కుమారులు చనిపోవడంతో బాత్రూంలో చీరతో ఊరి వేసుకుని దేవి బలవన్మరణానికి పాల్పడింది. స్నానానికి వెళ్లిన దేవి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బంధువులు విషయాన్ని గమనించారు. అప్పటికే దేవి మృతి చెందడంతో బంధువులు.. గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది..

Show comments