Wedding Drama: ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిపై మొదటి భార్య కంప్లెయింట్ ఇవ్వడంతో దెబ్బకు పెళ్లి వదిలి పెట్టి పారిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నిత్య పెళ్లికొడుకును పట్టుకుని కఠినంగా శిక్షించాలని వధువు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని యువతితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ ఘడియలు రానే వచ్చాయి. వివాహానికి వధువు ముస్తాబు అయింది. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనాలతోపాటు విందు, వినోద కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. ఇంతలో పెళ్లికొడుకు విడిది ఇంటిలో కనిపించకుండా పోయాడు.
Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!
ఐతే సత్యనారాయణకు ఆల్రెడీ ఓ మహిళతో పెళ్లి అయింది. పెళ్లై విడాకులు తీసుకున్న మహిళను సత్యనారాణ పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో తనను పెళ్లి చేసుకుని.. మళ్లీ వివాహానికి రెడీ కావడంపై పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ మహిళ. దాన్ని తెలుసుకున్న సత్యనారయణ మండపం నుంచి వెళ్లిపోయాడు.
Off The Record: పత్తిపాడులో హాట్ హాట్గా మద్యం మామూళ్ల టాపిక్
మరోవైపు విషయం తెలిసి వధువు తరఫు బంధువులు.. వరుడి కుటుంబ సభ్యులతోపాటు బంధువులను నిలదీశారు. దీంతో వారు కూడా వరుడి విషయం తమకు తెలియదంటూ చేతులెత్తేశారు. ఆ క్రమంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు వధువు తరఫు బంధువులు. నిత్య పెళ్లి కొడుకు అంటూ సత్యనారయణపై రాసిన ఫ్లెక్సీలు చేత పట్టి.. వరుడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
