Warangal : వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది. బాధితురాలు మరియమ్మ ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వరంగల్ కొత్త అదనపు ఎస్పి శుభం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అయితే, ఎస్సై శ్రీకాంత్ ఫిర్యాదు ఆధారంగా మిల్స్ కాలనీ పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటన చుట్టూ వివాదం రేగింది. స్థానికంగా ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారగా, పోలీసులపై సాధారణ ప్రజలు విరుచుకుపడుతున్నారు.
Smartphone Tips: ఫోన్ స్లో అయ్యిందా?.. కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు.. ఈ పనులు చేస్తే చాలు!