Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Police Solve Mother-Son Mystery Case With Help of Video Call: అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న తల్లికొడుకు.. తమ వద్ద లక్షలున్నాయని గొప్పలకు పోయి, తమ చావుని కొని తెచ్చుకున్నారు. బాగా ఆస్తి ఉన్న వాళ్లేమో అని ఇద్దరు వ్యక్తులు భావించి, వారిని చంపేసి ఆ డబ్బుల్ని కాజేయాలని చూశారు. ప్లాన్ ప్రకారం చంపారు కానీ, వాళ్ల వద్ద ఏమీ లేదని తెలిసి ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులకు పట్టుపడకుండా పారిపోయారు. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ కేసు, ఎట్టకేలకు ఒక వీడియో కాల్ ఆధారంగా చేధించారు. పరారైన ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖ నగరం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాబాద్‌లో ఎం. గౌరమ్మ (52), ఆమె కుమారుడు పోలారెడ్డి నివసిస్తున్నారు. ఓ మద్యం దుకాణం వద్ద వీళ్లు ఆహార పదార్థాల్ని అమ్మేవారు. ఈ క్రమంలో వాళ్లకు చైతన్య, కిశోర్‌బాబు పరిచయం అయ్యారు. మద్యం తాగడానికి వచ్చినప్పుడల్లా.. ఆ తల్లికొడుకులతో వాళ్లిద్దరు మాట్లాడుతుంటేవారు. ఈ నేపథ్యంలోనే గౌరమ్మ తన వద్ద రూ. 30 లక్షలు ఉన్నాయని, బంగారు నగలు కూడా ఉన్నాయని చెప్పింది. తాము ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది. ఆమె మాటలు నిజమేనని చైతన్య, కిశోర్‌బాబు అనుకున్నారు. దీంతో.. వాళ్లు మత్తుమందు ఇచ్చి, డబ్బు కాజేయాలని చూశారు. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. చివరికి తల్లికొడుకుల్ని హతమార్చి, డబ్బులు దోచుకోవాలని పథకం రచించారు.
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
ఒకరోజు పోలారెడ్డి ఇంటికి వెళ్లి మందు తాగాలని ప్లాన్ వేశారు. గౌరమ్మ మద్యం దుకాణం వద్దే ఉండగా.. పోలారెడ్డితో కలిసి చైతన్య, కిశోర్ బాబు రెండు బుల్లెట్ వాహనాల్లో ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే పోలారెడ్డి హతమార్చారు. అదే సమయంలో కొడుక్కి భోజనం ఇద్దామని వచ్చిన గౌరమ్మని సైతం చంపేశారు. అనంతరం ఇంట్లో డబ్బుల కోసం వెతకగా.. వారికి రూ. 2 వేలు మాత్రమే దొరికాయి. అలాగే.. బంగారం అనుకొని రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు పట్టుకుని చెన్నై పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తొలుత గౌరమ్మ చిన్నకోడలిపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెకు ఈ హత్యలతో సంబంధం లేదని తేలింది. మరి, ఎవరు హత్య చేశారా? అని పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో.. వాళ్లకు ఒక క్లూ దొరికింది.
ఈ హత్యలు జరిగే ముందు.. మస్కట్‌లో ఉన్న గౌరమ్మ కుమార్తె, తన సోదరుడు పోలారెడ్డితో వీడియో కాల్ మాట్లాడింది. అప్పుడు ఫోన్ కట్ కావడంతో, పక్కనే ఉన్న చైతన్య ఫోన్ తీసుకొని, సోదరికి పోలారెడ్డి ఫోన్ చేశాడు. ఆ సమయంలో చైతన్య, కిశోర్‌లను సైతం పరిచయం చేశాడు. ఆ వీడియో కాల్ మాట్లాడాకే.. తల్లికొడుకుల్ని చంపి ఆ ఇద్దరు పరారయ్యాడు. మస్కట్ నుంచి గౌరమ్మ కూతురు వచ్చాక, ఆ వీడియో కాల్ గురించి పోలీసులకు తెలిపింది. చిన్నకోడలు సైతం రెండు బుల్లెట్ వాహనాలు వచ్చినట్టు చెప్పింది. ఈ క్లూస్ ఆధారంగా హత్య చేసింది వారేనని నిర్ధారించుకున్నారు. చెన్నై నుంచి చైతన్మ, కిశోర్ తిరిగి వస్తుండగా.. వాళ్లను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!