Medak Crime: సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులు చేశారా లేదా అని నిర్దారించుకోకుండానే ప్రాణాలు తీస్తున్నారు. మంత్రాలు చేస్తుందనే నెపంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కత్రియాల గామంలో కలకలం రేపుతుంది.
Read also: TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..
కత్రియాల గామంలో ద్యాగల ముత్తవ్వ తన కొడుకు, కోడలితో నివాసం ఉండేది. అయితే ఆమె రోజూ ఇంటింటికి వెళ్లి పలకరించేది. అయితే గ్రామస్తులు ముత్తవ్వపై అనుమానం పెంచుకున్నారు. ముత్తవ్వ ఇళ్ల ముందుకు వచ్చి ఏదో మంత్రాలు చేస్తుందని ఆమెను అనుమానించడం మొదలు పెట్టారు. అందుకే వారి ఇళ్లలో కీడు జరుగుతుందని ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఇలా ముగ్గురు తోడై ముత్తవ్వను చంపాలని ప్లాన్ వేసుకున్నారు. గురువారం అర్థరాత్రి ముత్తవ్వ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో ఉండగా మంత్రాలు చదువుతుందని అనుమానంతో వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె పై వేశారు.
ఆమె తేరుకునే లోపే నిప్పంటించారు. ఒక్కసారి మంటలు చెలరేగడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తమపై కూడా దాడి జరుగుతుందనే భయంతో కొడుకు, కోడలు అక్కడి నుంచి పరారయ్యారు. మహిళ కేకలు విన్న కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ముత్తవ్వ మృతి చెందింది. మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
PM Modi: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశం!