Site icon NTV Telugu

Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!

Cyber Link

Cyber Link

వాలెంటైన్స్ డేకు సైబర్ క్రిమినల్స్ కూడా రెడీ అయిపోయారు..!! అదేంటీ.. వాలెంటైన్స్ డేకు సైబర్ క్రిమినల్స్ రెడీ అయ్యారని ఆలోచిస్తున్నారా? అంటే.. వారు కూడా లవ్‌ చేస్తారని కాదు..!! వాలెంటైన్ డే కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారిని సైబర్ లింకులతో బురిడీ కొట్టిస్తారు.. ఖాతాలు ఖాళీ చేస్తారు. ఈ క్రమంలో ఫిష్షింగ్ లింక్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిజమైన ప్రేమికుల సంగతి అటు పక్కకు పెడితే.. వాలెంటైన్స్ డే కోసం సైబర్ క్రిమినల్స్ సైతం రంగంలోకి దిగారు. ప్రేమికుల సందడి పెరుగుతున్న వేళ.. సైబర్ నేరగాళ్ల చలనం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.. ప్రేమికుల కోసం వెతుక్కునే వారే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.

ఇందులో భాగంగా గిఫ్ట్ ఆఫర్లు, డేటింగ్ అండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఫేక్ ప్రొఫైల్స్ పంపిస్తూ వల విసురుతున్నారు. అంతే కాదు స్మార్ట్‌గా లక్షల రూపాయలు దోచేస్తున్నట్లు పలు కేసులు పోలీసుల దృష్టికి వస్తున్నాయి.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఆకర్షణీయమైన ఫొటోలతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ముందుగా స్నేహం పెంచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. కొన్ని రోజుల చాట్ తర్వాత గిఫ్ట్ పంపాను.. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు పంపాలి.. అంటూ బాధితుల్ని నమ్మిస్తారు. విదేశాల నుంచి పార్సిల్ వస్తోందని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి..

Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..

ఇలాంటి మోసాలే కాదు.. వాలెంటైన్ స్పెషల్ కాంబో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ముందుగానే చెల్లింపులు తీసుకుంటున్నారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే వెబ్‌సైట్ మాయమవుతోంది. రిఫండ్ కోసం సంప్రదిస్తే నాట్ రెస్పాండ్ మెసేజ్ ప్రత్యక్షమవుతుంది.. మరోవైపు సైబర్ క్రిమినల్స్ మరో తరహా మోసానికి సైతం తెరలేపుతున్నరు. కొంతమంది యువతతో స్నేహం పెంచుకుని వీడియో కాల్‌కు ఆహ్వానిస్తారు. వ్యక్తిగతంగా ఉన్న వీడియోలను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు…

సో.. వాలెంటైన్స్ వేళ యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని చెబుతున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దంటున్నారు. ముందస్తు చెల్లింపులు చేయడానికి ముందు వెబ్‌సైట్ నిజస్వరూపం తెలుసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ప్రయివేట్ వీడియోలతో ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేసినట్లయితే భయపడకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.. ఆకర్షణీయమైన ఆఫర్లు, అతి తక్కువ ధరలు, త్వరగా డబ్బు పంపమని ఒత్తిడి చేయడం లాంటివి చేస్తే.. వాటిని కచ్చితంగా మోసంగానే గుర్తించాలంటున్నారు పోలీసులు..

Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!

Exit mobile version