NTV Telugu Site icon

UP: స్నేహితుడి ప్రియురాలి వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్.. బయటకు తీసుకెళ్లి ఏం చేశాడంటే..!

Up

Up

వారిద్దరూ మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. పై చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ కలిసి దూర ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. అయితే హఠాత్తుగా స్నేహితుడు హత్యకు గురయ్యాడు. బ్రెస్ట్ ఫ్రెండే.. ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. ఉన్నట్టుండి ఫ్రెండ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

అభినవ్.. మరో యువకుడు మంచి స్నేహితులు. ఇంటర్‌లో కలిసి చదువుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తున్నారు. ఇక అభినవ్‌కు స్కూటర్ నడపడం వచ్చు. దీంతో ఇద్దరు కలిసి కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తుంటారు. అయితే అభినవ్ స్నేహితుడికి ప్రియురాలి ఉంది. అయితే స్నేహితుడి మొబైల్‌లో ఉన్న ప్రియురాలి వీడియోలు, ఫొటోలను అభినవ్ దొంగిలించి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం.. అభినవ్ స్నేహితుడికి రుచించలేదు. విపరీతమైన కోపం తెప్పించ్చింది

ఇక శనివారం యథావిధిగా స్నేహితులిద్దరూ కోచింగ్ క్లాస్‌కు వెళ్లారు. సాయంత్రం వరకు అభినవ్ ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అభినవ్ స్నేహితుడిని నిలదీస్తే ఎక్కుడున్నాడో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. దీంతో అభినవ్ తండ్రి సునీల్ కుమార్ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అభినవ్ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు కలిసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అభినవ్ స్నేహితుడ్ని తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. తన ప్రియురాలి ఫొటోలు, వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్ చేయడంతో చంపేసినట్లుగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

తన ఫోన్‌లో ప్రియురాలి వీడియోలు ఉన్నాయని.. వాటిని అభినవ్ బదిలీ చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రియురాలు తనకు చెప్పడంతో అభినవ్‌ను చంపాలని పథకం వేసినట్లు తెలిపాడు. శనివారం తన ఫోన్‌ను అమ్మేయాలని అభినవ్‌కు చెప్పానని.. అమ్మేందుకు ఇద్దరం మొబైల్ దుకాణానికి వెళ్లి ఫోన్‌ను రూ.8 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. అనంతరం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఓ గొట్టపు బావి దగ్గర ఆగినట్లు చెప్పాడు. అకస్మాత్తుగా బ్యాగులోంచి సుత్తి తీసి అభినవ్ తలపై కొట్టగా చనిపోయినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు.

ఇక అభినవ్ మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయమంటూ బంధువులు నిరాకరించారు. అభినవ్‌ను ఒక్కడే చంపి ఉండడని.. మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నిజనిజాలను వెలికి తీయాలని అభినవ్ బంధువు కుద్దీప్ కోరారు. ఇక పోలీసులు నిందితుడ్ని, సుత్తిని స్వాధీనం చేసుకుని మైనర్ కోర్టులో హాజరుపరిచారు.

Show comments