UP: స్నేహితుడి ప్రియురాలి వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్.. బయటకు తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
- స్నేహితుడు ప్రియురాలి వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్
- బయటకు తీసుకెళ్లి స్నేహితుడిని చంపేసిన యువకుడు
- ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. పై చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ కలిసి దూర ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. అయితే హఠాత్తుగా స్నేహితుడు హత్యకు గురయ్యాడు. బ్రెస్ట్ ఫ్రెండే.. ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. ఉన్నట్టుండి ఫ్రెండ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
అభినవ్.. మరో యువకుడు మంచి స్నేహితులు. ఇంటర్‌లో కలిసి చదువుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తున్నారు. ఇక అభినవ్‌కు స్కూటర్ నడపడం వచ్చు. దీంతో ఇద్దరు కలిసి కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తుంటారు. అయితే అభినవ్ స్నేహితుడికి ప్రియురాలి ఉంది. అయితే స్నేహితుడి మొబైల్‌లో ఉన్న ప్రియురాలి వీడియోలు, ఫొటోలను అభినవ్ దొంగిలించి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం.. అభినవ్ స్నేహితుడికి రుచించలేదు. విపరీతమైన కోపం తెప్పించ్చింది
ఇక శనివారం యథావిధిగా స్నేహితులిద్దరూ కోచింగ్ క్లాస్‌కు వెళ్లారు. సాయంత్రం వరకు అభినవ్ ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అభినవ్ స్నేహితుడిని నిలదీస్తే ఎక్కుడున్నాడో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. దీంతో అభినవ్ తండ్రి సునీల్ కుమార్ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అభినవ్ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు కలిసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అభినవ్ స్నేహితుడ్ని తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. తన ప్రియురాలి ఫొటోలు, వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్ చేయడంతో చంపేసినట్లుగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
తన ఫోన్‌లో ప్రియురాలి వీడియోలు ఉన్నాయని.. వాటిని అభినవ్ బదిలీ చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రియురాలు తనకు చెప్పడంతో అభినవ్‌ను చంపాలని పథకం వేసినట్లు తెలిపాడు. శనివారం తన ఫోన్‌ను అమ్మేయాలని అభినవ్‌కు చెప్పానని.. అమ్మేందుకు ఇద్దరం మొబైల్ దుకాణానికి వెళ్లి ఫోన్‌ను రూ.8 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. అనంతరం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఓ గొట్టపు బావి దగ్గర ఆగినట్లు చెప్పాడు. అకస్మాత్తుగా బ్యాగులోంచి సుత్తి తీసి అభినవ్ తలపై కొట్టగా చనిపోయినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు.
ఇక అభినవ్ మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయమంటూ బంధువులు నిరాకరించారు. అభినవ్‌ను ఒక్కడే చంపి ఉండడని.. మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నిజనిజాలను వెలికి తీయాలని అభినవ్ బంధువు కుద్దీప్ కోరారు. ఇక పోలీసులు నిందితుడ్ని, సుత్తిని స్వాధీనం చేసుకుని మైనర్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!