Site icon NTV Telugu

Crime: ముస్లిం భార్య వివాదం.. తల్లిదండ్రుల్ని చంపి, మూడు ముక్కలు చేసిన కొడుకు..

Crime

Crime

Crime: ఒక వ్యక్తి ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారి తీసింది. డబ్బు, భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఐదు రోజుల గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు గురువారం దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి, వారి శరీరాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి, సిమెంట్ బ్యాగులో పెట్టి, స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు.

నిందితుడు అంబేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అంబేష్ కోల్‌కతాలో ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మతాంతర వివాహం కావడంతో తరుచుగా అంబేష్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీని వల్ల కుటుంబంలో గొడవలు ప్రారంభయ్యాయి. ఇద్దరు విడిపోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో విడిపోతే, తనకు భరణం చెల్లించాలని అతడి భార్య డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో, అంబేష్ తన తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం కోరాడు. దీని తర్వాత గొడవలు మరింత ముదిరాయి.

Read Also: Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?

గత మూడు నెలల క్రితం, అంబేష్ కోల్‌కతా నుంచి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయినప్పటికీ అంబేష్‌, అతడి తల్లిదండ్రుల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. దీంతో డిసెంబర్ 8న తీవ్ర వాగ్వాదం తర్వాత, అంబేష్ తన తల్లి బబితా(63) తలపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. అతడి తండ్రి శ్యామ్ బహదూర్(65) కేకలు వేయడానికి ప్రయత్నించగా, అంబేష్ అతడిని కూడా రాడ్‌తో కొట్టి తాడుతో ఉరివేసి చంపాడు. ఆ తర్వాత, మృతదేహాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి ఆరు సిమెంట్ సంచుల్లో కుక్కి, కారులో వాటిని తీసుకెళ్లే గోమతి నదిలో పారేశాడు. తల్లికి చెందిన ఒక భాగాన్ని వారణాసి వైపు వెళ్తున్నప్పుడు సాయి నదిలో విసిరేశాడు.

అయితే, తన తల్లిదండ్రులు కనిపించండం లేదని, తన సోదరుడిని సంప్రదించలేకపోతున్నారని డిసెంబర్ 13న కూతురు డిసెంబర్ 13న అదృశ్యం కేసు నమోదు చేసింది. డిసెంబర్ 15న అంబేష్ ఎక్కడ ఉన్నాడో కనిపిపెట్టిన పోలీసులు, విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గజ ఈతగాళ్లు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version