NTV Telugu Site icon

Black magic: యూట్యూబ్‌లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..

Crime

Crime

Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని హతమార్చి, అతడి పుర్రెతో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఇలా చేస్తే వారు రూ. 50-60 కోట్లు లభిస్తాయనే దురాశతో హత్య చేసినట్లు తేలింది.

బీహార్‌కి చెందిన నిందితులు ఢిల్లీలో ఈ -రిక్షా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు తాము యూట్యూబ్‌లో చూసి చేతబడి, ఇతర క్షుద్రపూజలు నేర్చుకున్నామని, మానవ పుర్రెతో పూజలు చేస్తే వెంటనే ధనవంతులం అవుతామని భావించారు. అరెస్టయిన నిందితులను వికాస్ అలియాస్ పరమాత్మ, నరేంద్ర, పనవ్ కుమార్, పంజజ్‌గా గుర్తించారు.

Read Also: Eluru Crime: దారుణం.. చిన్నారి మృతదేహాన్ని విసిరేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఈ నేరం జూన్ 2024లో జరిగింది. పోలీసులు ఘజియాబాద్‌లోని కాలువలో తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో ఇద్దరు నిందితులు వికాస్ గుప్తా(24), ధనంజయ్(25)లను అరెస్ట్ చేశారు. విచారణలో వికాస్ ఒక వ్యక్తిని చంపి, అతడి పుర్రెను తాంత్రిక పూజల్లోఉఫయోగించినట్లు చెప్పారు. పరమాత్మ సూచన మేరకు రాజు షా(29) అనే వ్యక్తిని హత్య చేసినట్లు వికాస్ గుప్తా, ధనుంజయ్ పోలీసులకు చెప్పారు. డిసెంబర్ 07న శనివారం పరమాత్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

పంకజ్, పవన్ కోసం ఒక పుర్రెను సంపాదించాలని తనను నరేంద్ర కోరినట్లు పరమాత్మ వెల్లడించారు. చేతబడి వారిని ధనవంతులుగా చేస్తుందని నమ్మి.. పరమాత్మ రాజుని చంపి అతడి పుర్రెని తెస్తే రూ. 5 లక్షలు ఇస్తానని వికాస్, ధనుంజయ్‌ని ఆశపెట్టారు. ఆ పుర్రెని నరేంద్రకు ఇవ్వాలని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఘజియాబాద్ డ్రైన్ నుంచి రాజు పుర్రెను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Show comments