యూపీ ఎటాహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతును హత్య చేసి ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ ఎటాహ్ జిల్లాలో రైతును హత్య చేసి.. ఆపై ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టి పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మలవాన్ పట్టణానికి చెందిన 50ఏళ్ల రైతు జఝూర్ సింగ్.. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఎంత సేపటికి భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లంయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రైతు సెల్ ఫోన్ ట్రాక్ చేశారు. సిగ్నల్ రైతు ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఇంద్రపాల్ సింగ్ అనే ఇంటి దగ్గర చూపించింది. దీంతో అతని ఇంటిని తనిఖీ చేయగా.. ఓ పెట్టెలో ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. వ్యక్తిగత వివాదంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ఇంద్రపాల్, అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారు.