Kadapa Crime: కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి… కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా హత్య చేశారు.. దీనికి అంతటికీ కారణం.. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమెను నానా రకాలుగా వేధింపులకు గురిచేయడమే కారణమని తెలుస్తోంది.. అయితే, ఈ ఘటనలో మరో కోణం కూడా లేకపోలేదు..
Read Also: Rajendra Prasad : ఈ వయసులో ఇదేంటి.. రాజేంద్రా నీకేమైంది?
నిషేధిత ఉగ్రవాద సంస్థలో గతంలో చాంద్ బాషా స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉండే వారని పోలీసులు గుర్తించారు.. ఆర్కే నగర్‌కు చెందిన చాంద్ బాషాకు, అశోక్ నగర్‌లో నివాసం ఉండే మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది… అయితే, అప్పటినుండి తన కుమార్తె ఆయేషాను చాంద్ బాషా వేధిస్తూ ఉండడంతో పలుమార్లు.. వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, పంచాయతీల పర్వం సాగింది.. ఇక, గత రెండు సంవత్సరాలుగా చాంద్ బాషా భార్యకు దూరంగా ఆర్కే నగర్ లో నివాసం ఉంటూ వచ్చారు.. ఆయేషా తండ్రి తన కుమార్తెకు అల్లుడు చాంద్ బాషా అన్యాయం చేస్తున్నాడని జీర్ణించుకోలేకపోయాడు.. పది రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చి అల్లుడి హత్యకు స్కెచ్ వేశాడు.. ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ బాషాను అక్కడి నుంచి రహస్యంగా తీసుకొచ్చి మహబూబ్ బాషా తన ఇంట్లో అతి దారుణంగా వేట కొడవళ్ళతో తలపై విచక్షణ రహితంగా నరికి చంపారు… ఈ ఘటనపై చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
