సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకు ఎదుటివారిని అతికిరాతకంగా హతమారుస్తున్నారు. తాజగా ఒక వ్యక్తి టైలర్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు. కారణం ఏంటి.. అంటే నా షర్ట్ లూజ్ గా కుట్టాడు అని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది
వివరాలలోకి వెళితే మధురవాడ సమీపంలో ఒక 70 ఏళ్ళ బుడు అనే వ్యక్తి టైలరింగ్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒడిశా నుంచి వచ్చిన అతను మధురవాడలోనే కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇక కాలనీకి చెందిన గణేశ్ అనే కుర్రాడు బట్టలు కుట్టాలని 10 రోజుల క్రితం బుడు వద్దకు వచ్చాడు. ఇక గురువారం బట్టలు తీసుకెళ్లడానికి వచ్చిన గణేష్ షర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అయితే అది కొద్దిగా లూజ్ గా ఉండడంతో బుడు ఇంటికి వెళ్ళాడు. బుడు వయస్సు మీద పడడంతో రాత్రి కళ్ళు కనిపించవని, ఉదయం రమ్మని కోరాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ కోపంతో రగిలిపోయి బుడును ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేని వృద్ధుడు అక్కడిక్కడే మృతిచెందాడు. తన భర్తను కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా నిందితులు ఆగలేదని.. దారుణంగా కొట్టారంటూ మృతుడి భార్య లక్ష్మీ కన్నీరు మున్నీరు అవుతోంది. ఇంత చిన్న విషయానికి ఒక మనిషి ప్రాణం తీయడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.