హైదరాబాద్ నాంపల్లిలో రెండు హత్యలు కలకలం రేపాయి. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలపై రాయితో మోది హత్యకు పాల్పడ్డారు నిందితులు. అలాగే, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా రాయితో తలపై బాది చంపేశారు. రెండు సంఘటనల్లో ఇద్దరిని హతమార్చిన వ్యక్తి ఒక్కడే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.