Sonali Phogat Case: నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది. డ్రగ్స్ సరఫరా చేసిన డ్రగ్ పెడ్లర్‌తో పాటు రెస్టారెంట్ యజమానిని కూడా అరెస్ట్ చేసినట్లు డీజీపీ జస్పాల్ సింగ్ వెల్లడించారు. ఈ కేసుపై అనేక బృందాలు పని చేస్తున్నాయన్నారు. ఒక బృందాన్ని హర్యానాకు కూడా పంపుతామని ఆయన తెలిపారు.
సోనాలి ఫోగట్ కుటుంబం అనుమానాలను ధ్రువీకరించడానికి తాము ఒక బృందాన్ని హర్యానాకు పంపుతున్నామని డీజీపీ చెప్పారు. ఎందుకంటే ఆ సందేహాలు దర్యాప్తుపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ఈ కేసులో గోవా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 సెక్షన్ కింద డ్రగ్ పెడ్లర్, కర్లీస్ యజమానిపై గోవా పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ జోడించారు.
మూడు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటల పాటు ఉన్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ ఫోగాట్ సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ వసీలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌భేటీ.. విషయం ఇదేనా..?
నిందితులు సోనాలీ ఫోగాట్‌కు క్లబ్‌లోలో సింథటిక్ డ్రగ్ ఇచ్చారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సింథటిక్ డ్రగ్ అని చెప్పారు కానీ, ఆ పదార్థం పేరు ఏమిటన్నది వెల్లడించలేదని తెలిపారు. ఆ పదార్థాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ డ్రగ్ ఇచ్చిన అనంతరం ఆమెను టాయిలెట్‌లోకి తీసుకెళ్లారని, అక్కడ నిందితులు, ఫోగాట్ రెండు గంటలపాటు ఉన్నారని.. అక్కడ ఏం జరిగిందో మాత్రం నిందితులు నోరు విప్పలేదన్నారు. అయితే ఆమెకు వారిచ్చిన డ్రగ్స్ కారణంగానే మరణించినట్లు తెలుస్తోందన్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం సోనాలీ ఫోగాట్ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెతో పాటు ఉన్న ఆ సహాయకులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తన టిక్‌టాక్ వీడియోలతో ఖ్యాతి గడించిన ఈ నటి, 2019 హర్యానా ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. ఆమె 2020లో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా కనిపించింది.