NTV Telugu Site icon

Crime: ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై ట్యూషన్ టీచర్ అఘాయిత్యం..

Crime

Crime

Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది.

Read Also: Puspa Kissik Song: ‘దెబ్బలు పడతయిరో’ అంటూ స్టెప్స్ అదరగొట్టిన బామ్మలు.. వీడియో వైరల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర త్రిపాఠి అనే వ్యక్తి ఎక్స్‌ట్రా క్లాసులు ఉన్నాయని చెప్పి అక్కాచెల్లెళ్లను ప్రలోభపెట్టాడు. అనంతరం వీరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ అయిన చెల్లిపై, ఆ తర్వాత అక్కపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన ఇద్దరు శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని తెలిపారు.

కుటుంబ సభ్యులు జరిగిన దారుణం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాళ్లను వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అరెస్టవుతాననే భయంతో నిందితుడు ఇంటి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నాడు. నిందితుడికి సంబంధించిన సమాచారం ఎవరి వద్దనైనా ఉంటే ఇవ్వాలని కోరారు. నిందితుడిపై అత్యాచారం, లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ(పోక్సో)చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.