Site icon NTV Telugu

Triple Murder Case: ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి-అన్న ఘాతుకం.. భార్యభర్తలతో పాటు రెండేళ్ల చిన్నారి హత్య..

Bihar

Bihar

Triple Murder Case: బీహార్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. తమను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యకు ఆమె సోదరుడు సహకరించాడు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో భార్యభర్తలను, వారి రెండేళ్ల చిన్నారిని యువతి తండ్రి, అన్న కలిసి హత్య చేశారు.

Read Also: Ram Temple: 2100 కిలోల గంట, 108 అడుగుల అగర్‌బత్తి.. దేశవిదేశాల నుంచి శ్రీరాముడి చెంతకు కానుకలు..

చందన్ కుమార్(40), చందిని కుమారి(23)లు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తన కన్నా 17 ఏళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకోవడం యువతి తండ్రికి ఇతర కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం 4.25 గంటలకు నవ్‌టోలియా గ్రామంలోని తమ ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చందన్ కుమార్, చాందిని కుమారి వారి రెండేళ్ల రోష్ణికుమారిలను పప్పు సింగ్ అడ్డుకుని ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. పప్పు సింగ్ కొడుకు ధీరజ్ సింగ్ వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు.

నిందితులు పప్పు సింగ్ మరియు మహిళ తండ్రి మరియు సోదరుడు ధీరజ్ కుమార్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నౌగాచియా పోలీస్ జిల్లా ఎస్పీ సుశాంత్ కుమార్ సరోజ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు బుల్లెట్స్, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Exit mobile version