NTV Telugu Site icon

Suryapet Crime: తాటిచెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి.. మృతదేహాన్ని దించుతుండగా షాకింగ్ ఘటన

Suryapet Crime

Suryapet Crime

Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కిందకి దించుతుండగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Read also: Health Tips : కాలేయాన్ని రక్షించే కాఫీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!

సూర్యపేట జిల్లాలోని ముకుందాపురానికి చెందిన 75 ఏళ్ల దేశగాని వెంకటేశం.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్యకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో సమస్యలను తట్టుకోలేక శుక్రవారం కల్లు తీసేందుకు గ్రామ శివారుకి వెళ్లి.. తాటిచెట్టు ఎక్కి ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్నవారు.. తాటిచెట్టుకు వెంకటేశం వేలడటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు, పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుమారు 50 అడుగుల ఎత్తులో వెంకటేశంను కిందకు దించే ప్రయత్నంలో.. గ్రామానికి చెందిన కొందరు యువకులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మృతదేహాన్ని కిందకు దించే సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఒక యువకుడు తాటి చెట్టు పైకి ఎక్కి మృత దేహాన్ని కిందికి దించే ప్రయత్నం చేస్తుండగా.. మరో యువకుడు నాగార్జున తాడు సాయంతో చెట్టు మధ్య వరకు చేరుకున్నాడు. డెడ్‌బాడీని తాడు సాయంతో కిందకు దించుతుండగా.. అనూహ్యంగా తాడు తెగిపోయింది. దీంతో మృతదేహం చెట్టు మధ్యలో ఉన్న నాగార్జునపై బలంగా దూసుకొచ్చింది. మృతదేహంతో పాటు నాగార్జున కింద పడిపోయాడు. ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగార్జున పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
KTR Tweet: హైదరాబాద్‌ కు రాహుల్‌ రావాలి.. కేటీఆర్‌ ఆహ్వానం

Show comments