Tragedy in Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ యువతిని చంపి అశోక్ అనే యువకుడు కూడా తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొద్దీ కాలంగా యువతి, అశోక్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి ఆమె పేరెంట్స్ చదివిస్తున్నారు. ఇక, ఉద్యోగం కోసం చెన్నై వెళ్లిన ప్రియుడు ఎన్నిసార్లు కాల్స్, మెసేజ్ లు పెట్టిన యువతి రిప్లై ఇవ్వకపోవడంతో.. బాలికపై అనుమానం వ్యక్తం చేశాడు అశోక్.
Read Also: Liquor : హైదరాబాద్‌లో రోడ్డుపై పడ్డ మద్యం సీసాలు.. ఎత్తుకెళ్లిన జనాలు
ఇక, చెన్నై నుంచి నిన్న ఉదయమే అశోక్ కాకినాడకు వచ్చాడు. ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వాలని అమ్మాయికి మెసేజ్ పెట్టగా.. అతడ్ని కలిసేందుకు అమ్మాయి ఒప్పుకుంది. దీంతో ఆమె ఫ్రెండ్ తో కలిసి ఇంట్లోంచి బయటికి వచ్చి అశోక్ దగ్గరికి వెళ్లింది మైనర్ బాలిక. ఎందుకరు తనను అవాయిడ్ చేస్తున్నావ్ అని యువతితో ప్రియుడు అశోక్ వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా మరొకరిని ఇష్టపడుతున్నావా అని ఆమెను ప్రశ్నించగా.. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా మనం కలిసి ఉండడం కుదరదని ఆ యువతి తేల్చి చెప్పింది. ఇక, కోపోద్రిక్తుడైన యువకుడు.. ఆమె చెప్తే వినే పరిస్థితుల్లో లేదని అత్యాచారానికి ప్రయత్నం చేసి, బ్లేడ్ తో గొంతు కోసి చంపేశాడు. బ్రతికి ఉంటే, ఎలాగైనా దొరికిపోతానని భావించిన అశోక్.. తాను ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చివరగా కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు.
