Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
Also Read
- Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
పోలీసుల సమాచారం మేరకు, మృతుడు అమర్నాథ్ రెడ్డి (45)గా గుర్తించారు. ఎదురింటికి చెందిన రాహుల్ రెడ్డి అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి కూతురు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో బిర్యానీ విందు ఏర్పాటు చేసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ సమయంలో అమర్నాథ్ రెడ్డి రెండో అంతస్తులో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక, అమర్నాథ్ రెడ్డి తండ్రి నాథముని రెడ్డిని కూడా హత్య చేయడానికి నిందితుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులోనే రాహుల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు నిందితుడి ఇల్లు, బైక్‌ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!