Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs LSG- Virat Kohli: నిన్న (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పోరులో ఆర్‌సీబీ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు సులభతరమైన విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తృటిలో ఓ రికార్డును మిస్ చేసుకున్నాడు. తన 66వ ఐపీఎల్ హాఫ్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్‌కు చిక్కాడు. కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియంలో భార్య అనుష్క శర్మ తీవ్ర నిరాశకు గురైంది. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.
READ MORE: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. కోహ్లీ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేష్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్‌సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ టోర్నీలో తన జోరును కొనసాగిస్తోంది.
READ MORE: Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!