Moolakona Mystery: తిరుపతి జిల్లా చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బాగా కుళ్లిన స్థితిలో డెడ్ బాడీలు కనిపించాయి. అక్కడికి వెళ్లిన పశువుల కాపరులు.. వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని అటవీప్రాంతంలో బయటపడ్డ మృతదేహాల కేసులో మిస్టరీ వీడలేదు. మహిళ, వ్యక్తి మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి పోలీసులు అక్కడే ఖననం చేశారు. మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా వీటిని హత్యలుగా పోలీసులు నిర్ధారించారు. గ్లౌజులు, దుస్తులు కుక్కి.. నోటికి ప్లాస్టర్ వేసినట్లు తెలిపారు. మృతుడిని తమిళనాడులోని తంజావూర్‌కు చెందిన కలై సెల్వన్‌గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ అతడి వదిన, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు. ఆస్తి కోసం జరిగిన హత్యా? లేదా పరువు హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
READ ALSO: Cyber Fraud: బల్క్‌గా వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నామని ప్రకటన.. నమ్మారో అంతే..!!
సెప్టెంబర్ 14న మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐతే ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. అదే సమయంలో పక్కనే ఓ వస్త్రం కప్పి ఉన్న స్థితిలో మహిళ శవం పడి ఉంది. అంతే కాదు ఆ పక్కనే మరో రెండు గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లూ కనిపించాయి. అందులో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి..
పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దేనని గుర్తింపు
తొలుత వీటిని గుర్తు తెలియని డెడ్ బాడీలుగా పోలీసులు భావించారు. ఐతే అక్కడ లభించిన కొన్ని క్లూల ఆధారంగా హత్యగా నిర్ధారించారు. మొత్తంగా అక్కడ లభించిన నాలుగు మృతదేహాలపై పోలీసులు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చారు. సెప్టెంబర్ 15న పోలీసులు గుర్తించిన మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దేనని తేలింది. ఇందుకు సంబంధించి అక్కడ వారికి ఓ ఆస్పత్రికి సంబంధించిన చీటి లభించింది. అదే ప్రదేశంలో లభించిన మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెలవే కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
జయమాలిని, ఇద్దరు పిల్లలపై మిస్సింగ్ కేసు నమోదు
అయితే గత జులైలో జయమాలిని, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కువైట్‌లో పని చేస్తున్న వెంకటేశన్, జులైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ప్రస్తుతం వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కలై సెల్వన్‌కు జయమాలిని కుటుంబంతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే, నలుగురి మరణాలు హత్యలేననే అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..