Selling Snake : 10 గ్రా పాము విషం ఖరీదు లక్షల్లో.. లాకప్ లో ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ముల్లును ముళ్ళుతోనే తియ్యాలి అన్నట్లు విషానికి విరుగుడు విషమే. అందుకే పాము, తేలు వంటి విషపురుగుల విషానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలానే పాము చర్మాన్ని బ్యాగులు, బెల్ట్లు మొదలనవి తారలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇక పాము విషం ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 10 గ్రాముల పాము విషం అక్షరాలా రూ/లక్షన్నర పలుకుతుంది. దీనితో కొందరు వన్య ప్రాణుల కిందకి వచ్చే పాములను పట్టుకుని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అయితే పాములను పట్టుకోవడం, చంపడం, చిత్ర హింసలకు గురిచేయడం చట్ట విరుద్ధం. ఇలా చట్టవిరుధంగా పాములను పట్టుకుని సొమ్ము చేసుకున్న వారిని గతంలో చటం శిక్షించిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది..
Read also:Tamilnadu: తమిళనాడులో దారుణం.. బట్టలిప్పి యువకులపై మూత్ర విసర్జన
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మధుర నగరానికి చెందిన సత్పాల్, శ్యామ్ నాథ్, పప్పు నాథ్ గత కొంత కాలంగా పాములను పట్టుకుని, వాటి నుండి విషాన్ని సేకరించి బ్లాక్ మార్కెట్ లో పది గ్రాముల పాము విషాన్ని రూ/లక్షన్నర ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలానే పాములను కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్మగ్లర్లను మధుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. నిందితులు పాములను అడవులు, జాతీయ ఉద్యానవనాల నుంచి పట్టుకుంటున్నారని.. అలానే బ్లాక్ మార్కెట్ లో రూ/ లక్షన్నరకు వాటి విషాన్ని విక్రయించడంతో పాటుగా పాములను కూడా అమ్ముతున్నారని తెలిపారు. అలానే నాలుగు కొండచిలువలు, మూడు నాగుపాములను నిందితుల నుండి మధుర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పాముల స్మగ్లర్లను పట్టుకునేందుకు పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యులు సహాయం చేశారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!