మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న అక్కను, సొంతతమ్ముడు, తల్లి కలిసి అతిదారుణంగా హతమార్చిన ఘటన స్థానికం గ సంచలనం రేపుతోంది. అతి క్రూరంగా తలనరికి, ఆ తలను పట్టుకొని రోడ్డుపైకి వచ్చి సెల్ఫీలు దిగుతూ అరాచకము సృష్టించాడు 18 ఏళ్ళ యువకుడు.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఒక గ్రామంలో 19 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ యువతి గతేడాది తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని ఇంట్లోచి వెళ్ళిపోయింది. అయితే తమకు ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమెపై తల్లి, తమ్ముడు కక్ష కట్టారు. తన వలన పరువు పోయిందని భావించి ఎలాగైనా ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే యువతి గర్భవతి అయ్యిందని తెలుసుకొని ఆమెను పలకరించడానికి వెళ్తున్నట్లు ఆమె ఇంటికి వెళ్లారు తల్లీకొడుకులు. ఎన్నోరోజుల తరువాత తల్లిని, తమ్ముడిని చుసిన యువతి సంతోషంగా వారిని ఇంటికి ఆహ్వానించి టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో పుట్టింటివారితో మాట్లాడుతుందని భార్యను వదిలి భర్త బయటికి వెళ్ళాడు.
ఇక ఇదే అదును అనుకున్న తమ్ముడు తనతో పాటు తెచ్చిన కత్తితో వంటగదిలో ఉన్న అక్కపై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసాడు. గర్భంతో ఉందని కూడా లేకుండా ఆమె మెడను కత్తితో నరికి తలను పట్టుకొని రోడ్డు మీదకు వచ్చాడు. ఆ ఘటనను చూసి స్థానికులు షాక్ అయ్యారు. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటే ఊరుకుంటామా ..? ఇలాగె చేస్తాం అంటూ సైకోలా మాట్లాడుతూ ఆ తలతో సెల్ఫీలు దిగాడు. వెనుక నుంచి తల్లి సైతం నవ్వుతూ .. దరిద్రం వదిలింది అంటూ అరవసాగింది. ఇక విషయం తెలుసుకున్న భర్త ఇంటికి వచ్చేసరికి అతడిపై కూడా దాడికి పాల్పడడానికి ప్రయత్నించగా అతడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.. అనంతరం అక్క తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తల్లీకొడుకులు లొంగిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.