Kamareddy: కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్.ఐ. సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసు మిస్టరీగా మారింది. వీరి ముగ్గురి కాల్ డేటా, వాట్స్ అప్ చాటింగ్ లు కీలకంగా మారాయి. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకుని, వాట్స్ అప్ చాటింగ్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ముగ్గురు మృతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే కారులో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తులో పోస్ట్ మార్టం నివేదిక కీలకం కానుంది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.
Read also: KTR Quash Petition: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
కామారెడ్డి జిల్లా భీక్కునూర్ ఎస్సై సాయికుమార్, బీబీ పెట్ కానిస్టేబుల్ శృతి, సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృత దేహాలు లభ్యమయ్యాయి. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుండి ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను పోలీసుల వెలికితీయగా.. గురువారం ఎస్సై సాయికుమార్ మృతదేహం గుర్తించారు.
Read also: Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ.. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు మృతదేహాలు లభ్యం అయ్యాయని తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారం మిస్సయిన ముగ్గురు ఆచూకీ గుర్తించామని ఎస్పీ సింధు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు. ఎస్సై జేబులోనే సెల్ ఫోన్ గుర్తించామని అన్నారు. విచారణ కొనసాగుతోంది.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ సింధు తెలిపారు.
Selfie Suicide: నాచారంలో యువతి ఆత్మహత్య.. నా చావుకు కారణం వారే అంటూ సెల్ఫీ వీడియో..