Selfie Suicide: నాచారంలో యువతి ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీప్తి అనే యువతి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాచారం హెచ్ఎంటి నగర్ సరస్వతి కాలనీలో తన తల్లితో నివాసం ఉంటుంది. దీప్తి తార్నాక ఐఐసిటీలో పరిశోధక విద్యార్థినీ. దీప్తి తండ్రి సంగీతరావు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి వేరుగా ఉంటుంది. ఐజీ ఆఫీసులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసిటిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. దీప్తి తండ్రి సంగీతరావు ఉద్యోగం కోసం అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు.
Read also: Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
బిల్లా అనిల్‌కు దీప్తి తండ్రి సంగీత రావు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో సంగీత రావును డబ్బులు తిరిగి ఇవ్వాలని బిల్లా అనిల్ కోరాడు. డబ్బుల విషయంలో సంగీతరావు సైలెంట్ గా ఉండటంతో సీన్ లోకి అనిల్ భార్య ఎంట్రీ ఇచ్చింది. సంగీత రావు, దీప్తి పైన అనిల్, భార్య అనిత నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఫిర్యాదు చేసేంత వరకు దీప్తికి డబ్బుల విషయం తెలియదు. అందులో తన ప్రమేయం లేదని, తన తండ్రితో కలిసి ఉండటం లేదని చెప్పినా అనిల్, భార్య అనిత వినలేదు. డబ్బుల విషయంలో దీప్తిని వేధించారు.
Read also: CM Revanth Reddy : మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి
అనిల్ భార్య అనిత దీప్తిపై ఫిర్యాదుపై దీప్తి తీవ్ర మనస్థాపానికి గురైంది. తన తల్లితో చెప్పుకోలేక మౌనం వహించిన దీప్తి తనకు జరిగిన అవమానంతో బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో దీప్తి తల్లి గది తలుపు తీసి చూడ దీప్తి మృతి చెంది ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీప్తి ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనిల్, భార్య అనిత వేధింపుల వల్లనే చనిపోయిందని దీప్తి తల్లి ఆరోపిస్తుంది. వారి వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించింది. గదిలో దీప్తి సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీప్తి తండ్రి సంగీత రావు, అనిల్, భార్య అనితలను అదుపులో తీసుకుని విచారించనున్నారు.
Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..