Marriage: నాలుగు పెళ్లిళ్లు.. ఏడుగురు పిల్లలు.. ఐదో పెళ్లిలో ట్విస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే అతగాడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ, పాడుబుద్ధి మరో పెళ్లి చేసుకోవాలని చూశాడు.. కానీ, పిల్లల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది… పెళ్లికి సిద్ధమైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది… ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.. మొదటి భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… రెండో భార్యకు ఏడుగురు పిల్లలు.. అయితే, ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. అక్కడితో పెళ్లిళ్లపై ఉన్న ఆశ చావలేదు.. రహస్యంగా మరో పెళ్లికి సిద్ధం కావడంతో.. పిల్లలు వచ్చి.. తండ్రికి దేహశుద్ది చేశారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మొత్తంగా ఐదో పెళ్లి జరగకుండా రెండో భార్య, ఆమె పిల్లలు బంధువులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చి అడ్డుకున్నారు.. వరుడిలా అలంకరించుకుని పెళ్లి పీటల మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తండ్రిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన పిల్లలు.. అతడిని పట్టుకునుఇ చావబాదారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. పిల్లలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పెళ్లి ఆపేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మధ్యవయస్సులో ఉన్న వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయని.. ఇది ఐదో పెళ్లి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పిల్లలు. తమ తండ్రిని పెళ్లిచేసుకుంటున్న బాలిక తల్లిదండ్రులు.. తమ పేరు మీద ఉన్న ఇల్లు, ఇతర ఆస్తులు కావాలని మాట్లాడుకున్నారని, దాని ఆధారంగానే పెళ్లి జరుగుతుందని పిల్లలు ఆరోపిస్తున్నారు. తమ తండ్రి తమ తల్లిని పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!