Site icon NTV Telugu

Selfi Problem: సెల్ఫీ తెచ్చిన కష్టాలు.. బదిలీ అయిన పోలీసు అధికారి

Selfi

Selfi

Selfi Problem: ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్‌ కనిపిస్తుంది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంటే ఊరుకుంటారా? దాంతో సెల్ఫీనో లేకపోతే రీల్స్ చేయడమో చేస్తుంటారు. అలా చేసిన వాటితో కొందరు పాపులర్‌ అవుతారు.. మరికొందరు వాటితో చిక్కుల్లో పడతారు. అయితే ఇక్కడ కుటుంబంలోని భార్యా, పిల్లలు తీసుకున్న సెల్ఫీతో ఒక పోలీస్ అధికారి చిక్కుల్లో పడ్డారు. వారు తీసుకున్న సెల్ఫీ మూలంగా తాను బదలీ కావల్సి వచ్చింది. పైగా సెల్ఫీపై విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఒక సెల్ఫీ ఇంత పనిచేసిందా? అనుకుంటున్నారా? అవును మరీ.. ఆ సెల్ఫీ మామూలు సెల్ఫీ కాదు.. నోట్ల కట్టలతో వారు తీసుకున్న సెల్ఫీ .. అందుకే దానికి అంతా క్రేజీ.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. ఇవి వివరాలు..

Read also: Ashtalakshmi Ashtottara Shatanamavali Stotra Parayanam: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట నుండి అలక్ష్మీ పోయి అష్టలక్ష్ములు వస్తారు

ప్రస్తుత జనరేషన్‌ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం కామన్ అయ్యింది. ఓ పోలీసు అధికారి భార్య, పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోకు .. అతడ్ని బదిలీ చేసి .. ఆ అతనిపై విచారణకు ఆదేశించారు. రూ.500 నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ పోలీసు అధికారి బదలీ కావల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని సబ్-ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నారు.ఇటీవల ఆ అధికారి భార్య, అతని పిల్లలు నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ వైరల్ కావడంతో ఆ అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో ఆ అధికారిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలో రూ. 14 లక్షల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన పోలీసు అధికారి భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫోజు ఇవ్వడం ఆ ఫోటోలో చూడవచ్చు.నోట్ల కట్టల ఫోటో వైరల్ కావడంతో, వెంటనే పోలీసు అధికారిపై దర్యాప్తుకు ఆదేశించారు. స్టేషన్‌ ఇన్‌చార్జి రమేష్‌ చంద్ర సహాని బదిలీ అయ్యారు. బదలీ అయిన రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకుంటూ.. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో తీసుకున్నదని చెప్పాడు.

Read also: Bank Accounts Rules: ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలపై ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారి మీడియాతో మాట్లాడాడు. బెహతా ముజావర్ స్టేషన్-హౌస్ ఆఫీసర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించాము. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ చేయబడ్డాడని చెప్పిన ఉన్నతాధికారి.. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version